‌‌అమెరికాలో సూర్యాపేట యువకుడి మృతి

  • స్విమ్మింగ్​ఫూల్​ పడి ఘటన 

హైదరాబాద్:  అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్‌లో పడి  సూర్యాపేట జిల్లాకు చెందిన  యువకుడు మృతి చెందారు.  ఆత్మకూరు మండలం పాతర్లపాడుకు చెందిన ప్రవీణ్  అమెరికాలో చాలాకాలంగా టీచర్‌గా పనిచేస్తున్నాడు.  ఈ క్రమంలో   ప్రవీణ్ ఈతకు వెళ్లి  ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో పడి చనిపోయాడు. ఈ విషయాన్ని అతడి ప్రెండ్స్ బాధిత కుటుంబ సభ్యులకు ​సమాచారం అందించారు.  ప్రవీణ్​ డెడ్​బాడీని స్వగ్రామానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం సాయం చేయాలని ప్రవీణ్​ ప్రేరేంట్స్​కోరుతున్నారు.