
టేక్మాల్, వెలుగు: యువకుడు అదృశ్యమైన సంఘటన టేక్మాల్‌లో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామనికి చెందిన ఫొటో గ్రాఫర్బాజ గణేశ్ (28) ఈ నెల 2న ఫొటోలు తీయడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి రావడానికి మూడు, నాలుగు రోజులు పడుతుందన్నాడు. నాలుగు రోజులైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గణేశ్ సెల్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్వస్తోంది. స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆదివారం గణేశ్తండ్రి కిష్టయ్య టేక్మాల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మురళీ తెలిపారు.