తల్లిదండ్రులను చంపి.. ఇంటికి తాళమేసి..

  • బెంగళూరులో ఓ కొడుకు దారుణం

బెంగళూరు: ఓ యువకుడు తన తల్లిదండ్రులను చంపేసి, డెడ్​బాడీలను అక్కడే వదిలి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. కర్నాటకలోని బెంగళూరులో మంగళవారం ఈ దారుణం బయటపడింది. సోమవారం రాత్రి ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. దక్షిణ కన్నడ జిల్లా ఉల్లాల్‌కు చెందిన భాస్కర్, శాంతదంపతులు వాళ్ల కొడుకులు సాజిత్, శరత్(27)​తో కలిసి బెంగళూరులోని కొడిగెహళ్లిలో ఉంటున్నారు. శాంత రిటైర్డ్ ఉద్యోగి, భాస్కర్ ప్రభుత్వ ఆఫీస్ క్యాంటీన్​లో క్యాషియర్​గా పనిచేస్తున్నారు. వీళ్ల పెద్ద కొడుకు సాజిత్ తిండ్లు ఏరియాలో ఉంటుండగా, చిన్న కొడుకు శరత్​ పేరెంట్స్​తో ఉంటున్నాడు. 

అతనికి, తల్లిదండ్రుల మధ్య తరచుగా గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి కూడా పెద్ద ఎత్తున గొడవ పడ్డారని స్థానికులు తెలిపారు. అదేరోజు శరత్ ఇంటికి తాళం వేసి వెళ్లాడని తెలిపారు. ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో సాజిత్ ఇంటికి వెళ్లి చూడగా పేరెంట్స్ రక్తపు మడుగులో పడి ఉన్నారని చెప్పారు.