ఖానాపూర్, వెలుగు: జగిత్యాల జిల్లాలోని సదర్మాట్ రిజర్వాయర్‌లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని ముస్లింపురా కాలనీకి చెందిన ఐదుగురు యువకులు సోమవారం ఖానాపూర్ మండలం మేడంపల్లి శివారులోని సదర్మాట్ ఆనకట్ట వద్దకు వెళ్లారు. అందరూ కెనాల్లో స్నానానికి దిగగా షేక్ రేహాన్(17) అనే యువకుడు అక్కడి ఫ్లడ్ గేట్తూములో ఇరుక్కుపోయాడు. తోటి యువకులు సులేమాన్, ఇమ్రాన్, అజీమ్, ముల్తాన్ కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రేహాన్ ఊపిరాడక చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు,ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని రేహాన్ డెడ్‌బాడీని బయటకు తీశారు.
ALSO READ :గద్వాల మీటింగ్ రద్దు..ఢిల్లీలోనే చేరికలు
వెల్దిలో టబ్బులో పడి బాలుడు..
రఘునాథపల్లి: జనగామ జిల్లాలో టబ్బులో పడి 11 నెలల బాలుడు చనిపోయాడు. రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన ఎక్కలదేవి గీత, లక్ష్మణ్‌కు ఇద్దరు కొడుకులు. చిన్నకొడుకు హేమంత్(11 నెలలు)కు సోమవారం సాయంత్రం తల్లి గీత స్నానం చేయించేందుకు నీటి టబ్బు దగ్గరకు తీసుకెళ్లింది. పిల్లాడిని అక్కడ వదిలి టవల్ కోసం ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి బాలుడు టబ్బులో పడి ఉన్నాడు. బయటకు తీసి డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని తెలిపాడు.