పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయిండు

గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. హెల్దీగా ఉంటున్న వారు, ముఖ్యంగా యువకులు గుండెపోటుకు గురవుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా  ఓ యువకుడు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. కరీంనగర్ లోని   తీగలగుంటపల్లికి చెందిన  రావుల విజయ్ అనే యువకుడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో తన ఫ్రెండ్ పెళ్లికి వచ్చాడు. 

రాత్రి పెళ్లి భరత్ లో తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా విజయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతని ఫ్రెండ్స్ ఒక్కసారిగా ఏమైందో తెలియక షాక్ కు గురయ్యారు.  హుటాహుటిన విజయ్ ను సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే  అప్పటికే  విజయ్ గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

 అప్పటివరకు పెళ్లి వేడుకల్లో అందరూ హుషారుగా ఆడుతూ పాడుతూ కనిపించిన విజయ్ మృతి చెందడంతో ఆ పెళ్ళంట విషాదం నెలకొంది. తమ స్నేహితుడు ఇలా అర్థాంతరంగా చనిపోవడం విజయ్ స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.