మేడ్చల్: అతి వేగం, అజాగ్రత్తగా ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైన దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ జిల్లా ముడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన బన్నీ (19),మధు (22), మణిదీప్ (21)లు ముడుచింతలపల్లి గ్రామం నుంచి కేశవరం వైపు పల్సర్ బైక్పై అతివేగంగా వెళుతున్నారు.
ALSO READ | హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
ఈ క్రమంలో కేశవరం గ్రామ సమీపంలోని బంగారు గుట్ట మూల మలుపు వద్ద వాహనం అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వల్లపు బన్నీ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మణిదీప్, మధును చికిత్స నిమిత్తం స్థానిక ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించారు. బాధిత యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.