పెండ్లి కోసం రోడ్డుకెక్కిన యువకుడు

బ్యాచిలర్స్ తమకి కాబోయే లైఫ్​ పార్ట్​నర్ గురించి ఎన్నో ఊహించుకుంటారు. ​ఫలానా క్వాలిటీస్​ ఉండాలని కలలు కంటారు. అందుకు డేటింగ్​ యాప్స్, మ్యారేజ్​ బ్యూరోల్లో వెతుక్కుంటారు. లేదంటే తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఓకే చెప్తారు. కానీ, లండన్​లో ఉండే ముహమ్మద్​ మాలిక్​ అరేంజ్డ్​​ మ్యారేజ్​ నుంచి తప్పించుకునేందుకు వెరైటీగా ఆలోచించాడు.‘సేవ్​ మీ ఫ్రమ్​ అరేంజ్డ్​​ మ్యారేజ్​’ అని ఒక హోర్డింగ్​ తయారుచేయించుకున్నాడు. అంతేకాదు తనకు నచ్చిన అమ్మాయిని వెతుక్కునేందుకు ఏకంగా ఒక వెబ్​సైట్ నడుపుతున్నాడు.  

బర్మింగ్​హమ్​లో ఉండే ముహమ్మద్​ మాలిక్​ పాకిస్తాన్​కు చెందినవాడు. ఇన్నొవేషన్​ కన్సల్టెంట్, ఎంట్రప్రెనూర్ కూడా​ అయిన మాలిక్​కు ఇప్పుడు 29 ఏండ్లు. పెండ్లి చేసేందుకు ఇంట్లోవాళ్లు సంబంధాలు చూస్తున్నారు. అయితే, వాళ్ల కంటే ముందే తనకు నచ్చిన అమ్మాయిని వెతుక్కోవాలని డిసైడ్​ అయ్యాడు. అలాగని  పెద్దలు చూసిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం ఇష్టం లేక కాదు. 

తన డ్రీమ్​ గర్ల్​ని తానే వెతుక్కోవాలని అడ్వర్టైజింగ్​ మొదలుపెట్టాడు. ‘సేవ్​ మీ ఫ్రమ్​ అరేంజ్డ్​ మ్యారేజ్​’ అని రాసి ఉన్న 20 అడుగుల హోర్డింగ్స్​ని బర్మింగ్​హమ్​, మాంచెస్టర్​ సిటీల్లోని ట్రాఫిక్​ సిగ్నళ్లు, ఫేమస్​ ప్లేస్​ల దగ్గర పెట్టించాడు. వాటి మీద తన ఫొటో, వెబ్​సైట్​ Findmalikawife.com లింక్​ కూడా ఉంటాయి. అతని బిల్​బోర్డ్​ ఆలోచన బాగానే వర్కవుట్అయి.. వందల సంఖ్యలో మ్యారేజ్​ ప్రపోజల్స్​ వచ్చాయి. 

అందుకే ఇలా...
ఇప్పటివరకు నాకు సరిజోడైన అమ్మాయి దొరకలేదు. అలాంటి అమ్మాయిని వెతకడం కొంచెం కష్టమే అనిపించింది. అందుకనే హోర్డింగ్​​ అడ్వర్టైజ్​మెంట్ ఆలోచన చేశాను. బిల్​బోర్డ్​లు చూసి వందల సంఖ్యలో మెసేజ్​లు వచ్చాయి. నాకు కావాల్సిన క్వాలిటీస్​ ఉన్న లైఫ్​ పార్ట్​నర్ ఇకనైనా దొరుకుతుందేమో చూడాలి​.