Video Viral: నెత్తిపై ఫ్రిజ్... సైకిల్ తొక్కుతున్న యువకుడు

బరువులు ఎత్తి టైటిల్స్ గెలుపొందిన వారు ఉన్నారు. జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ.. కేజీలు కేజీలు బరువులు లేపేవాళ్లు ఉన్నారు. అంతేకాకుండా చాలా మంది బరువులను మోస్తూ ఉంటారు. కానీ విచిత్రంగా ఓ వ్యక్తి తన తలపై ఓ బీరువాను పెట్టి తిరుగుతున్నాడు. అది కూడా మాములుగా కాదు ఓ సైకిల్ పై.. సోషల్ మీడియాలో హైలెట్ గా నిలవడం కోసం నెటిజన్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించే వీడియోలను చేస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఓ వ్యక్తి తలపై రిఫ్రిజిరేటర్‌( Refrigerator ) పెట్టుకుని సైకిల్‌పై వెళ్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బార్‌స్టూల్‌స్పోర్ట్స్ అనే ఐడీతో షేర్ చేశారు.  ఓ వ్యక్తి తన తలపై పెద్ద రిఫ్రిజిరేటర్‌ని ఉంచుకుని రద్దీగా ఉండే వీధిలో చాలా సులభంగా తొక్కడం చూడవచ్చు. అంత పెద్ద రిఫ్రిజిరేటర్ తలపై ఉన్న అతడి మెడ కొంచెం కూడా తొణకలేదు.మెడ ఎంత దృఢంగా ఉంటెనో ఇలాంటి స్టంట్ చేయడం సాధ్యమవుతుంది.

అమెరికాలోని న్యూయార్క్( New York ) వీధుల్లో ఈ వీడియో చిత్రీకరించారు.ఈ యువకుడి అద్భుతమైన ఫీట్ అతనికి ప్రపంచంలో బలమైన మెడ అనే బిరుదును సంపాదించిపెట్టింది.న్యూయార్క్ నగరం చాలా డిఫరెంట్ అని వీడియో క్యాప్షన్ గా రాశారు.ఈ వీడియో చూసిన  నెటిజన్లు  ఆశ్చర్యపోయారు.ఇది ఎలా సాధ్యమైందని నోరెళ్లబెడుతున్నారు.సైకిల్ తొక్కేటప్పుడు మనిషి తలపై అంత బరువైన వస్తువును బ్యాలెన్స్ చేస్తాడని ఇప్పటివరకు తాము ఊహించలేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ : తూ...యాక్.. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా ఇలా తయారు చేస్తారా..?

మరికొందరు అసలు అతని తలపై రిఫ్రిజిరేటర్ ఎలా వచ్చిందని? ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.ఓ వ్యక్తి తమ స్టవ్‌ తలపై ఎత్తుకొని బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చమత్కరించారు.హైతీలో ఓ వ్యక్తి కుక్కపిల్లతో వెళుతున్నప్పుడు పెద్ద కిచెన్ సెట్‌ను తలపై మోయడం తాము చూశామని మరొక వ్యక్తి వ్యాఖ్యానించాడు.

వైరల్‌గా మారుతున్న ఈ షాకింగ్  వీడియోకు ఇప్పటివరకు  ( వార్త రాసే సమయానికి) 7 మిలియన్లకు పైగా చూడగా.. 2 లక్షల 35 వేల మందికి పైగా లైక్ చేసారు. ఈ వీడియో చూసిన జనాలు రకరకాల కామెంట్స్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.