వీడి తెలివి అద్భుతం ​ : ఎడ్ల బండిని బైక్​ తో లాగాడు

వీడి తెలివి అద్భుతం ​ :  ఎడ్ల బండిని బైక్​ తో లాగాడు

బైక్‌‌ వెనుక బండి కట్టి...  
 

తెలివి తేటలు ఒకరి సొంతం కాదని .. నారాయణపేట జిల్లా యువకుడు నిరూపించాడు.  గతంలో  ట్రాన్స్​పోర్టుకు ఎద్దులబండిని ఉపయోగించేవారు.  ముఖ్యంగా ఎద్దుల బండి లేనిదే వ్యవసాయ పనులు అస్సలికి జరిగేవి కావు.  ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయనుకు కోండి.  దామర గిద్ద మండలానికి చెందిన ఓ యువకుడు వ్యవసాయానికి ఎద్దుల బండిని ఉపయోగిద్దామో.. ఏమో తెలియదు కాని.. తన బంధువుల దగ్గర ఎద్దుల బండి ఉందని తెలుసుకున్నాడు.  అయితే ఆ యువకుడు ఉండే ప్రదేశానికి 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో ఉన్న ఆ యువకుడి బంధువుల దగ్గర ఎద్దుల బండి ఉంది. 

అసలే ఎండాకాలం.. ఎద్దులు అస్సలు ఎండలో పనిచేయలేవు.  అందుకే ఎద్దుల బండిని ఉపయోగించి సందకాడ కాని ( సాయంత్రం) కాని.. ఉదయం 10 గంటల లోపు కాని ఎద్దులను ఉపయోగించేవారు.  అయితే ఎండలో మూగ జీవాలను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకున్నాడనుకుంట.  అందుకే ఎద్దుల బండిని తన బైక్​ హీరో స్ప్లెండర్​ కు కట్టి లాక్కొచ్చాడు.  దీనిని చూసిన నెటిజన్లు వీడి తెలివికి ఆశ్చర్యపడుతున్నారు.

హీరో స్ప్లెండర్‌‌ బైక్‌‌కు ఎద్దుల బండిని కట్టి ఓ యువకుడు 35 కోలోమీటర్లు తీసుకెళ్లాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని బాపన్‌‌పల్లికి చెందిన ఓ యువకుడికి పొలం పనుల కోసం ఎద్దుల బండి అవసరం పడింది. దీంతో తన బంధువుల వద్ద బండి ఉన్నట్లు గుర్తుకు రావడంతో దానిని తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఎండలో ఎద్దులను తీసుకెళ్లడం ఎందుకు అనుకున్నాడో ఏమో... తానే బైక్‌‌పై మద్దూరు మండలంలోని నందిపహాడ్‌‌కు వెళ్లాడు. ఎడ్ల బండిని బైక్‌‌ వెనకాల తాడుతో కట్టుకొని 35 కిలోమీటర్ల దూరంలోని బాపన్‌‌పల్లికి తీసుకొచ్చాడు. యువకుడి పని తీరు చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. -