కాజీపేట, వెలుగు: గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడికి కరెంట్ షాక్ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ పరిధిలోని కడిపికొండలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కాజీపేట కడిపికొండ మధ్యలో శనివారం ఓ గూడ్స్ రైలు ఆగింది. ఈ టైంలో హుజూరాబాద్‌కు చెందిన రాజు ట్రైన్ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న హైటెన్షన్ వైర్ల నుంచి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.