ఇంట్రెస్ట్‎కు రూ.5 లక్షలు తీసుకున్న యువకుడు.. గ్యాంగ్‎తో కలిసి కిడ్నాప్​చేసిన ఫైనాన్సర్​

ఇంట్రెస్ట్‎కు రూ.5 లక్షలు తీసుకున్న యువకుడు.. గ్యాంగ్‎తో కలిసి కిడ్నాప్​చేసిన ఫైనాన్సర్​

హైదరాబాద్: కుత్బుల్లాపూర్‎లోని పేట్​బహీరాబాద్​పీఎస్​పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వలేదని యువకుడిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్​ఈవెంట్​కోసం రూ. 5 లక్షలను యశ్వంత్​అనే యువకుడు తన ప్రెండ్​ ఫైనాన్సర్​శ్రీనాథ్​రెడ్డి దగ్గర అప్పుగా తీసుకున్నాడు.  దీంతో అప్పు తిరిగి ఇవ్వాలని ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  

ఫైనాన్సర్​శ్రీనాథ్ రెడ్డి, అతడి గ్యాంగ్‎తో కలిసి ఈ నెల14న హోలి పండుగ రోజున యశ్వంత్​ను బజాబ్​షో రూమ్​గ్రౌండ్స్​కు పిలిచి కిడ్నాప్​చేశారు.  అతడిపై  తీవ్రంగా దాడి చేశారు.  ఈ క్రమంలో ఇంటి నుంచి వెళ్లిన కొడుకు రాకపోవడంతో బాధితుడి తల్లి  శ్రీనాథ్​రెడ్డితో పాటు, 15 మందిపై పేట్​బహీరాబాద్​పీఎస్​లో ఫిర్యాదు చేసింది.  ఫైనాన్స్​పేరుతో శ్రీనాథ్​రెడ్డి  10–15 రూపాయల ఇంట్రెస్ట్​వసూళ్ల చేస్తున్నారని తెలుస్తోంది.  పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ | వ్యభిచార రొంపిలో దింపేందుకు బాలిక కిడ్నాప్.. తర్వాత జరిగింది ఇదే..