యువతిపై కత్తితో దాడి చేసి పొదల్లో పడేసి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లందు సత్యనారాయణపురంలో గురువారం అర్ధరాత్రి 18 ఏళ్ల యువతిపై ఓ యువకుడు కత్తితో దాడిచేశాడు. కత్తితో దాడి చేసి ముళ్ల పొదల్లో పడేశాడు. చేతులకు రక్తంతో వెళుతుండగా పెట్రోలింగ్  పోలీసులకు దొరికిపోయాడు. యువతిపై దాడి చేసినట్లు చెప్పటంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు పోలీసులు. ముళ్ల పొదల్లో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని ఇల్లందు ఆస్పత్రికి తరలించారు.  ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.