
మధిర, వెలుగు : వైరా నదిలో చేపలవేటకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని బంజారా కాలనీకి చెందిన అద్దంకి రవీంద్ర(18) తన మిత్రుడు నర్సింహాతో కలిసి సోమవారం మధిర రైల్వే బ్రిడ్జి సమీపంలో వైరా నదిలో చేపల వేటకు వెళ్లాడు.
చేపలు పట్టే క్రమంలో అద్దంకి రవీంద్ర ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. నర్సింహా వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ఈతగాళ్లతో నదిలో గాలించినా రవీంద్ర ఆచూకీ లభించలేదు.