ఇంటికి  చేరిన గల్ఫ్​ కార్మికుడి డెడ్‌బాడీ

మెట్ పల్లి, వెలుగు :  ఉపాధి కోసం  సౌదీ అరేబియాకు  వెళ్లిన యువకుడు 21 రోజుల కింద  గుండెపోటుతో చనిపోగా మంగళవారం అతడి డెడ్‌బాడీ ఇంటికి చేరింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం మఠంవాడకు చెందిన మార్గం విజయ్(35)  సౌదీ అరేబియా అల్ హసా సిటీలో లేబర్ పని కోసం ఎనిమిదేండ్ల కింద వెళ్లాడు.  గత ఏప్రిల్ లో ఆరోగ్యం బాగుండడం లేదని ఇండియాకు వచ్చి  ట్రీట్​మెంట్​ తీసుకుంటానని కుటుంబ సభ్యులకు ఫోన్  చేసి చెప్పాడు.   ఏప్రిల్ 26న  పని చేస్తున్న ప్రాంతంలో గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు.  

ఈ విషయాన్ని అదే కంపెనీలో పని చేస్తున్న కార్మికులు విజయ్​ కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి చెప్పారు. దీంతో చివరి చూపు కోసం డెడ్​బాడీని ఇంటికి తీసుకురావాలని జీడబ్ల్యూఏసీ సంస్థ, ఇండియన్​ ఎంబసీని ఆశ్రయించారు.  దీంతో  విజయ్ డెడ్​బాడీ 21 రోజుల తర్వాత మంగళవారం సొంతూరికి తీసుకొచ్చారు. సాయంత్రం కన్నీటి వీడ్కోలు మధ్య విజయ్ అంత్యక్రియలు నిర్వహించారు.  విజయ్ కు తల్లి గంగు, తండ్రి గంగారెడ్డి, భార్య నిశంతా, కూతుళ్లు దీక్షిత, అక్షిత ఉన్నారు.