మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ భవాని నగర్ లో ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న పూర్ణిమ అనే విద్యార్థిని డిసెంబర్ 22 రాత్రి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నిఖిల్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. అందుకే తన కూతురు మనస్తాపానికి గురై యాసిడ్ తాగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు . ప్రేమ పేరుతో నిఖిల్ అనే వ్యక్తి పూర్ణిమను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు పూర్ణిమ తరపు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. నిందితుడు నిఖిల్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.