దమ్మపేట మండలానికి చెందిన యువతికి ఒకేసారి నాలుగు ఉద్యోగాలు!

దమ్మపేట, వెలుగు:  మండలంలోని  తొట్టిపంపు గ్రామానికి చెందిన సోయం విజయ ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించింది. భర్త బాలరాజు సహకారంతో ఆమె ఎంఏ బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంది . 2023లో వచ్చిన గురుకుల నోటిఫికేషన్లలో అన్ని పరీక్షలు రాసి టీజీటీ తెలుగు, టీజీటీ సోషల్, పీజీటీ తెలుగు, జేఎల్ తెలుగు ఉద్యోగాలకు ఎంపిక అయ్యి అందరితో శభాష్ అనిపించుకుంటోంది.