ఐసీఏఆర్ లో శాస్త్రవేత్తగా ఖమ్మం జిల్లా యువతి

ఐసీఏఆర్ లో శాస్త్రవేత్తగా ఖమ్మం జిల్లా యువతి
  •     ఐసీఏఆర్  ఏఆర్ఎస్
  • రిక్రూట్ మెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక

కూసుమంచి, వెలుగు :  భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ( ఐసీఏఆర్) శాస్త్రవేత్తగా ఖమ్మం జిల్లాకు చెందిన యువతి ఎంపికైంది. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన పోలెపంగు జగ్గయ్య, -కుమారి దంపతుల కూతురు డాక్టర్ శ్రీలత ఇటీవల అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్ మెంట్ బోర్డ్ (ఏఎస్ఆర్బీ) విడుదల చేసిన ఫలితాల్లో పాథాలజీ (మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం )విభాగంలో ఓపెన్ కేటగిరిలో ఆల్ ఇండియా 5 వ ర్యాంకు సాధించింది.  సైంటిస్ట్ కావాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. 

ఆమె అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్,  మహారాష్ట్రలో ఎమ్మెస్సీ(ప్లాంట్ పాథాలజీ) చేసింది. అనంతరం హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్లాంట్ పాథాలజీ విభాగంలో  పీహెచ్ డీ కంప్లీట్ చేసి డాక్టరేట్ పట్టా పొందింది. 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ సాధించి, తాను చదువుకున్న కాలేజీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయింది. జాబ్ చేస్తూనే  ఐసీఏఆర్​ ఏఆర్ఎస్​– 2023  టెస్ట్ కు ప్రిపేరై ర్యాంక్ సాధించి శాస్త్రవేత్తగా ఎంపికైంది. శ్రీలత శాస్త్రవేత్త ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.  తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ర్యాంకు సాధించగలిగానని, వ్యవసాయంలో పరిశోధనలు చేసి అన్నదాతలను ఆదుకోవడమే తన లక్ష్యమని డాక్టర్​ శ్రీలత పేర్కొంది.