బట్టలుతకడానికి వెళ్లి యువతి గల్లంతు

బట్టలుతకడానికి వెళ్లి యువతి గల్లంతు
  • వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన

పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరులో బట్టలుతకడానికి కాలువకు వెళ్లగా, అందులోకి జారిపడి ఓ యువతి గల్లంతైంది. పెబ్బేరు పోలీసుల కథనం ప్రకారం..షేక్​ సఖినాబీ(25), సూర్యాపేట జిల్లా యల్లాపురం గ్రామానికి చెందిన షేక్​మహమూద్​ భార్యాభర్తలు. ఇద్దరూ పెబ్బేరులోని వినాయకనగర్​కాలనీలో ఉంటూ ఇండ్ల నిర్మాణ పనులు చేస్తూ బతుకుతున్నారు.

సోమవారం సాయంత్రం 4 గంటలకు సఖినాబీ..కాలనీలోని నలుగురు మహిళలతో కలిసి ఆటోలో వనపర్తి వెళ్లే దారిలో ఉన్న కాలువకు బట్టలుతకడానికి వెళ్లింది. ఈ క్రమంలోనే కాలు జారి కాలువలో పడిపోయింది. పక్కనున్న మహిళలు ఆమెను కాపాడటానికి ప్రయత్నించినా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. పోలీసులకు సమాచారమివ్వగా వారు నీటి సరఫరా ఆపివేయాలంటూ ఇరిగేషన్​ శాఖ ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. తర్వాత గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కేసు నమోదు చేసుకుంటామని ఎస్సై జగదీశ్వర్​ రెడ్డి తెలిపారు.