ఘట్ కేసర్, వెలుగు: బీటెక్ స్టూడెంట్కు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్ చేసిన ఓ యువతి డబ్బు డిమాండ్ చేసింది. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్నగర్కు చెందిన ఓ యువకుడు ఘట్కేసర్ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు.
చౌదరిగూడ మల్లమ్మ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గత గురువారం అర్ధరాత్రి టైంలో యువకుడి ఫోన్కు అన్నౌన్ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగా.. ‘హాయ్ నేను దీక్షికా అగర్వాల్’ అంటూ ఓ యువతి మాట్లాడింది. ‘నేను నార్త్ ఇండియా నుంచి మాట్లాడుతున్నా.. ఎలా ఉన్నావు? ఏమి చదువుతున్నావు? ఎగ్జామ్స్ఎప్పుడు?’ అంటూ మాటలు కలిపింది.
యువకుడు సమాధానం చెబుతుండగానే బట్టలు విప్పేసి ఆమె నగ్నంగా మారింది. మాట్లాడుతూనే స్క్రీన్ రికార్డింగ్ చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆ వీడియోను యువకుడి ఫోన్కు పంపింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వీడియోను పంపుతానని, సోషల్మీడియాలో వైరల్చేస్తానని బెదిరించింది. భయపడిపోయిన యువకుడు మొదట రూ.10 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. రెండోసారి డిమాండ్చేయడంతో రూ.20 వేలు పంపాడు. ఆ మరుసటి రోజు ఇంకా డబ్బు కావాలని బెదిరించడంతో బాధితుడు పోచారం ఐటీసీ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజువర్మ తెలిపారు.