మియాపూర్, వెలుగు : ఎన్ని పెండ్లి సంబంధాలు చూసినా కుదరకపోవడంతో డిప్రెషన్‌కు లోనైన ఓ యువతి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన మియాపూర్పీఎస్పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్లో ఉండే బోరగడ్డ కిస్టోఫర్కూతురు శ్రుతి(35) ఎంఫార్మసీ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు ఎన్ని పెండ్లి సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడంతో డిప్రెషన్‌కు గురైంది.
శనివారం ఉదయం 11 గంటల సమయంలో అపార్ట్మెంట్బిల్డింగ్నాలుగో ఫ్లోర్‌నుంచి కిందికి దూకింది. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.