విజృంభిస్తున్న డెంగ్యూ.. వ్యాధితో యువతి మృతి

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో  డెంగ్యూతో  కోల మమత(21) అనే యువతి శనివారం రాత్రి చనిపోయింది.  మహబూబాబాద్​ మున్సిపాలిటీ పరిధి గోపాలపురానికి చెందిన కోల రవి, -ఉప్పమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. చిన్న కుతూరు మమత నాలుగైదు రోజులుగా జ్వరంతో బాధపడ్తోంది. 

శుక్రవారం మరింత ఎక్కువ కావడంతో ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తీసుకెళ్లారు. డెంగ్యూ లక్షణాలతో ప్లేట్​లెట్లు పడిపోయి కండిషన్​ సీరియస్ ​మారడంతో ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.