సుల్తానాబాద్, వెలుగు: ప్రేమించి మోసం చేశాడంటూ సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామంలో ఓ యువతి(30) ప్రియుడి ఇంటి ముందు మంగళవారం ధర్నా చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన యువతికి కరీంనగర్‌లో డిగ్రీ చదివేటప్పుడు చిన్నబొంకూర్‌కు చెందిన యువకుడితో పరిచయమేర్పడింది. ఇద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడని ఆరోపించింది.
అయితే అతనికి ఇటీవల ఉద్యోగం రావడంతో తనను వదిలేశాడని చెప్పింది. కట్నం వస్తుందని ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడని కన్నీటి పర్యంతమైంది. సుల్తానాబాద్పోలీసులు అక్కడికి చేరుకొని యువతికి సర్దిచెప్పారు.