4 నెలల క్రితం జాబ్ను వదిలిపెట్టింది.. వారాసిగూడలో యువతి ఆత్మహత్య

4 నెలల క్రితం  జాబ్ను వదిలిపెట్టింది.. వారాసిగూడలో యువతి ఆత్మహత్య

పద్మారావునగర్, వెలుగు: వారాసిగూడలో ఉరేసుకొని యువతి మృతి చెందింది. ఇన్​స్పెక్టర్​సైదులు వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన నూనవత్​చలపతి కూతురు సంధ్య(22) ఎంపీహెచ్​డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి, జాబ్​ కోసం మూడేండ్ల కింద సిటీకి వచ్చింది. ఆ తర్వాత కాల్​సెంటర్​లో పని​చేస్తూ అమీర్​పేటలోని హాస్టల్లో ఉంది. 4 నెలల క్రితం ఆ జాబ్ను వదిలిపెట్టింది. అనంతరం గాంధీనగర్లోని హోమ్​కార్​ ఆఫీస్లో జాబ్ చేస్తూ, వారాసిగూడ పీఎస్​ పరిధిలోని న్యూ అశోక్​నగర్లో అద్దెకు ఉంటోంది.

తండ్రి చలపతి రెగ్యులర్గా కూతురుకు ఫోన్​ చేస్తూ, యోగ క్షేమాలు తెలుసుకునే వాడు. అయితే, ఆదివారం పలుమార్లు ఫోన్​ చేయగా, ఆమె లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబసభ్యులు సోమవారం ఉదయం కూతురు ఇంటికి వెళ్లి చూడగా, ఫ్యాన్​ కు ఉరేసుకొని కన్పించింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

శామీర్ పేట: జినోమ్ వ్యాలీ పీఎస్ పరిధిలోనూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లాల్ గడి మలక్ పేటకు చెందిన నాగరాజు (21)సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో గ్రామ శివారులోని మల్లన్న గుడి వద్ద చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు.