ఫతేపూర్: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల చిన్నారిని పంజాబ్‌లోని జలంధర్ పోలీసులు రక్షించారు. చిన్నారిని కిడ్నాప్
చేసిన యువతి సహా ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. నిషు ద్వివేది(20) తన బంధువుల కుమార్తె(3)ను
మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో కిడ్నాప్ చేసింది. అనంతరం తన ప్రియుడితో కలిసి పారిపోయి పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ హోటల్‌లో
దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ద్వివేది, ఆమె ప్రియుడు నవదీప్ సింగ్ అలియాస్ గిన్ని(25)ని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే విచారణ సందర్భంగా నిషు ద్వివేది కీలక విషయాలు వెల్లడించింది. తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. తమపై మరెవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నారిని కిడ్నాప్ చేశామని, చిన్నారితో కలిసి జలంధర్‌లోని ఓ హోటల్‌లో రూమ్ తీసుకుని భార్యభర్తల్లా కలిసి ఉంటున్నామని చెప్పుకొచ్చింది. అయితే, చిన్నారికి అపాయం చేయాలనేది తమ ఉద్దేశం కాదని పేర్కొంది. కాగా, నిందితుల నుంచి చిన్నారిని రక్షించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిషు, నవదీప్ సింగ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఏడాదికి 50 కిలోల ఫుడ్ పడేస్తున్నం
14 ఏళ్ల బాలుడిని లోబరుచుకొని ప్రెగ్నెంట్ అయిన 23 ఏళ్ల యువతి
ఆకతాయిల వేధింపులు: నార్సింగిలో యువతి సూసైడ్