మఠంపల్లి, వెలుగు : న్యూ ఇయర్ వేడుకల కోసం కేక్ తేవడానికి వెళుతుండగా లారీ ఢీకొని యువతి చనిపోయింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మండల ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గాయం గీతా రెడ్డి (14) తన తల్లి గతంలో చనిపోవడంతో తాత దగ్గర ఉండి చదువుకుంటోంది.
కొత్త సంవత్సరం సందర్భంగా కేక్ తేవడానికి బైక్ పై వెళుతుండగా లారీ ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతురాలు మఠంపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.