- వరల్డ్‌కప్‌కు ఎంపికైన అవినాష్‌రావు
- బ్యాట్స్ మెన్, కీపర్ గా ఇండియా టీంలో ప్లేస్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: అండర్–19 క్రికెట్వరల్డ్కప్ టీంకు రాజన్నసిరిసిల్ల జిల్లా యువకుడు ఎంపికయ్యాడు. ముస్తాబాద్‌మండలం పోతుగల్ గ్రామానికి చెందిన అవినాష్‌రావు వికెట్‌కీపర్, బ్యాటర్‌గా ఇండియా జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. అవినాష్ తండ్రి లక్ష్మణ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. క్రికెట్ మీద ఇష్టంతో అవినాష్ 9 ఏండ్ల నుంచే క్రికెట్ సాధన మొదలుపెట్టాడు. కొడుకు ఇష్టాన్ని గమనించిన లక్ష్మణ్ హైదరాబాద్ క్రికెట్అసోసియేషన్లో చేర్పించాడు.
బాగా కష్టపడిన అతను అండర్–14, అండర్–16 విభాగాల్లో హైదరాబాద్జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. అక్కడ సత్తా చాటి చాలెంజర్స్ టోర్నీకి ఎంపికయ్యాడు. అనంతరం అండర్–19 ఏ టీంకు సెలక్ట్అయి బ్యాటర్, వికెట్ కీపర్‌గా రాణించాడు. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన అవినాష్ అండర్–19 టీంలో ప్లేస్ సంపాదించాడు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఆసియాకప్ ఆడుతున్నాడు. అనంతరం డిసెంబర్19 నుంచి దక్షిణాఫ్రికాలో జరగనున్న ట్రై సిరీస్, ఆ తర్వాత జనవరి 19న అక్కడే జరిగే వరల్డ్కప్పోటీల్లో ఇండియా తరఫున ఆడనున్నాడు.
తన కొడుకు ఇండియా జట్టుకు ఎంపికకావడంపై తండ్రి లక్ష్మణ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తన కొడుకు ఇండియా సీనియర్ టీంకు ఆడాలని ఆకాంక్షించారు. గ్రామీణ నేపథ్యం కలిగిన అవినాష్ అండర్19 టీంకు ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతను గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలిచాడని అభినందిస్తున్నారు.