చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో యువకుడు మిస్సింగ్..

 చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో యువకుడు మిస్సింగ్..

పద్మారావునగర్, వెలుగు: చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ యువకుడు మిస్సింగ్​ అయ్యాడు. ఎస్​ఐ సబిత  వివరాల ప్రకారం... సీతాఫల్మండి డివిజన్​ మేడిబావికి చెందిన ఆర్​. కవిత ఈనెల 5 న షాద్​నగర్​ వెళ్ళగా..  కొడుకు  కిశోర్​ (24) ఒంటరిగా ఇంటి వద్దే ఉన్నాడు. మద్యాహ్నం  తల్లికి ఫోన్​ చేసి తాను హనుమకొండలోని  అమ్మమ్మ ఇంటికి వెళుతున్నానని చెప్పాడు.

 సాయంత్రం ఇంటికి  వచ్చిన కవిత అతనికి ఫోన్​ చేయగా కిశోర్​  లిఫ్ట్ చేయలేదు. తిరిగి రాత్రి ఫోన్​ లిఫ్ట్​ చేసి తాను జనగాంలో ఉన్నానని  ఉదయం ఇంటికి వస్తానని చెప్పాడు.  ఆ తర్వాత ఫోన్​ స్విచ్​ ఆఫ్​ వచ్చింది,  అతను  ఇంటికి రాలేదు.  తెలిసిన అన్ని చోట్లా వెతికినా ఆచూకీ దొరకలేదని  తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​.ఐ సబిత తెలిపారు.