లోన్ యాప్ వేధింపులు.. యువకుడి సూసైడ్..

లోన్ యాప్ వేధింపులు.. యువకుడి సూసైడ్..
  • యువకుడు సూసైడ్ మెదక్​ జిల్లా కాట్రియాలలో ఘటన 

రామాయంపేట, వెలుగు: లోన్  యాప్  నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు సూసైడ్  చేసుకున్నాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (30) మండలంలో మిషన్ భగీరథలో కాంట్రాక్ట్  ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లోన్ యాప్​లో రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడు. తీర్చకపోవడంతో యాప్‌‌‌‌‌‌‌‌  నిర్వాహకులు వేధించడం ప్రారంభించారు.

వేధింపులు తట్టుకోలేక మూడు రోజుల క్రితం గంగాధర్​ పురుగులమందు తాగాడు. బాధితుడిని వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడం తో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ పొందుతూ మంగళవారం మరణించాడు.