అరాచకం.. రాక్షసత్వం అంటే ఇలాగే ఉంటుందని నిరూపించారు వీళ్లు.. ఓ మనిషిని ఈడ్చుకెళ్లటం మామూలు.. వీళ్లు మాత్రం బండికి కట్టుకుని.. తాళ్లతో ఓ యువకుడిని లాక్కెళ్లారు. ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తుంటాయి. అచ్చం ఇలాంటి సన్నివేశమే ఒకటి బయటపడింది. యువకుడి చేతులకు తాడు కట్టి.. బండిపై ఉన్న ముగ్గురు యువకులు.. అతన్ని వేగంగా ఈడ్చుకెళ్లటం షాక్ కు గురి చేస్తోంది. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం.. నడి రోడ్డుపై.. అందరూ తిరుగుతున్న సమయంలోనే.. వేయి కళ్ల మధ్య.. ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు ఈ దుర్మార్గులు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మనం మనుషుల మధ్యే ఉన్నామా..? అనే అనుమానాలకు తావిస్తోంది ఈ ఘటన.. పూర్తి వివరాల్లోకి వెళితే..
యూపీలోని బరేలీలో పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని టూవీలర్ కు కట్టేసి వందల మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు ముగ్గురు వ్యక్తులు. టూవీలర్ పై ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నట్లు.. అక్కడి సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా రికార్డు అయ్యింది. బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది.
జులై 25వ తేదీ సాయంత్రం 4 గంటల 35 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటనలో బాధిత యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న యూపీ పోలీసులు.. నిందితులను గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
https://twitter.com/moidul37/status/1684938509474512897