రన్ టైమ్: 2 గంటల 25 నిమిషాలు
నటీనటులు: సందీప్ కిషన్,లావణ్య,రావు రమేష్,మురళీ శర్మ,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు
సినిమాటోగ్రఫీ: కవిన్ రాజ్
మ్యూజిక్: హిప్ హాప్ తమిళ
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్,విశ్వప్రసాద్,సందీప్ కిషన్,దయా పన్నెం
డైరెక్షన్: డన్నీస్ జీవన్ కానుకొలను
రిలీజ్ డేట్: మార్చి 5,2021
కథేంటి?
ఇది యానం లో జరిగే కథ.హాకీ గ్రౌండ్ ను పొలిటికల్ లీడర్ రావు రమేష్ వేరే ప్రాజెక్ట్ కోసం అమ్మకానికి బేరం పెడతాడు. ఆ హాకీ గ్రౌండ్ కోసం హీరో సందీప్ కిషన్ ఎలా పోరాటం చేశాడు.తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి.తను ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ అనే విషయం ఎందుకు చెప్పడు.? చివరికి ఆ గ్రౌండ్ ను ఎలా గెలుచుకున్నారనేది స్టోరీ.
నటీనటుల పర్ఫార్మెన్స్:
హీరో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా సరిగ్గా సరిపోయాడు. తన పాత్ర మేరకు బాగా చేశాడు.హీరోయిన్ లావణ్య ది క్యూట్ రోల్.బాగా చేసింది.ఓ సాంగ్ లో గ్లామర్ కూడా ఒలకబోసింది.రావు రమేష్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాణించాడు.కోచ్ పాత్రలో మురళీ శర్మ ఒదిగిపోయి నటించాడు.ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ సందీప్ ఫ్రెండ్స్ పాత్రల్లో ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అందించారు.సత్య,మహేష్ విట్టా కామెడీ చేయడానికి ప్రయత్నించారు.
టెక్నికల్ వర్క్:
కవిన్ రాజ్ సినిమాటోగ్రపీ బాగోలేదు.స్క్రీన్ అంతా వేరే ఏదో కలర్ వేసినట్టు చూడబుద్ది కాలేదు.కొత్త టెక్నిక్ కావచ్చేమో కానీ చూడటానికి ఇంపుగా అనిపించలేదు.మ్యూజిక్ యావరేజ్ గా ఉంది.బ్యాక్ గ్రౌండ్ కూడా సోసోగా ఉంది. ల్యాగ్ లు ఎక్కువున్నాయి.ఎడిటింగ్ లో లోపాలున్నాయి.డైలాగులు ఫర్వాలేదు.
విశ్లేషణ:
‘‘ఏ1 ఎక్స్ ప్రెస్’’ ఓ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా.ఇంతకుముందు సై,గోల్కొండ హైస్కూల్ లాంటి సినిమాల కథ అనిపిస్తుంది. కమర్షియల్ హంగుల కోసం చేసిన ప్రయత్నాలు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.ఎక్కడ ఎంగేజింగ్ గా అనిపించదు.సోసోగా వెళ్తూ ఉంటుంది.ఫస్టాఫ్ బోరింగ్ గా సాగుతుంది.లవ్ ట్రాక్ అస్సలు బాగాలేదు.ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి కాస్త ఫర్వాలేదనిపిస్తుంది.హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా ఇంపాక్ట్ చూపదు. ఫోర్స్ డ్ ఎమోషనల్ కంటెంట్ లా అనిపిస్తుంది. దాన్ని గుర్తు తెచ్చుకొని క్లైమాక్స్ లో కూడా హీరో బాధపడే సీన్లు అంతగా ఆకట్టుకోపోగా ఫోర్స్ గా అనిపిస్తాయి.అన్ని సీన్లు కూడా ఆల్రెడీ చూసేసినట్టుగా ,ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. తమిళ సినిమా రీమేక్ అయిన ఈ మూవీ ఆ సోల్ మిస్ అయింది.ఇక్కడ క్యారెక్టర్లు అంతగా సెట్ అవలేదు.అందుకే సినిమా చూస్తున్నంత సేపు విసుగొస్తుంది. ఓవరాల్ గా ‘‘ఏ1 ఎక్స్ ప్రెస్’’ స్క్రీన్ ప్లే ఎక్స్ ప్రెస్ లా సాగకుండా గూడ్స్ ట్రైన్ లా సాగుతుంది.
బాటమ్ లైన్: ఆర్డినరీ ఎక్స్ ప్రెస్.