మీది పాత కారా..? వెనుక కెమెరా లేదా..? ఇలా ఫిక్స్ చేసుకోండి..

మీది పాత కారా..? వెనుక కెమెరా లేదా..? ఇలా ఫిక్స్ చేసుకోండి..

ఇప్పుడు వస్తున్న అన్ని కార్లకు వెనుక భాగంలో ప్రత్యేకంగా కెమెరాలు ఉంటున్నాయి. కానీ.. పాత కార్లలో అలాంటి ఫీచర్లు ఉండవు. అలాంటి కార్ల కోసమే ఈ డ్యాష్​క్యామ్​ని తీసుకొచ్చారు. దీన్ని ఎలాంటి కార్లలో అయినా.. ఈజీగా ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు.

70ఎంఏఐ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్​లో మానిటర్​తోపాటు కెమెరా కూడా వస్తుంది. ఆ సెకండరీ కెమెరాని కారు వెనకభాగంలో బిగించాలి. మానిటర్​ని ముందు భాగంలో కార్​టాప్​కి బిగించాలి. మానిటర్​ వెనక ఉండే కెమెరాతో కారు ముందువైపు, సెకండరీ కెమెరాతో వెనుకవైపు వీడియో రికార్డ్​ అవుతుంది.

అదే వీడియోని మానిటర్​కు ఉండే డిస్‌‌ప్లేలో ప్లే చేస్తుంది. ఇది టచ్​స్క్రీన్​తో వస్తుంది. వాయిస్​తో కూడా కంట్రోల్​ చేయొచ్చు. ‘టేక్​ ఫొటో’ అనగానే ఫొటో తీసేస్తుంది. యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎవిడెన్స్​గా కూడా పనికొస్తుంది.

ఎందుకంటే.. యాక్సిడెంట్లను గుర్తించి 25 సెకన్ల పాటు వీడియో రికార్డింగ్‌‌ చేస్తుంది. ఆ ఫుటేజీని ‘ఈవెంట్’ అనే ప్రత్యేకమైన ఫోల్డర్‌‌లో సేవ్ చేస్తుంది. రివర్స్‌‌ గేర్​లోకి మారినప్పుడు డిస్​ప్లేలో ఆటోమేటిక్‌‌గా పార్కింగ్ అసిస్ట్ లైన్‌‌లను చూపిస్తుంది.

ధర : 17,999 రూపాయలు