అక్రమాస్తులపై విచారణ జరపండి.. సోమేష్పై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు

అక్రమాస్తులపై విచారణ జరపండి..  సోమేష్పై  సీబీఐ, ఈడీకి ఫిర్యాదు

మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్‌పై సీబీఐ,ఈడీకి ఫిర్యాదు చేశారు యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్‌ శ్రీకాంత్ నేత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు. సోమేష్ కుమార్ తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట భారీగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదు చేశారు.

సోమేష్‌కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు శ్రీకాంత్ .  గుర్‌గావ్‌లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయంటూ ఫిర్యాదులో తెలిపారు.  నోయిడాలోనూ కీలక ప్రాంతాల్లో బినామీల పేరుతో స్థలాలు కొన్నారని శ్రీకాంత్ ఆరోపించారు. రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలను జారీ చేశారని తెలిపారు. యాచారంలో సోమేష్‌కుమార్‌ భార్య పేరిట కొన్న 25 ఎకరాల భూమిని ఫిర్యాదులో ప్రస్తావించారు శ్రీకాంత్

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోనూ సోమేష్‌కుమార్‌కు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఫిర్యాదు చేశారు శ్రీకాంత్.  సోమేష్‌కుమార్, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ అధికారాన్ని దుర్వినియోగంతోనే సంపాదించారని ఆరోపించారు. సోమేష్‌కుమార్ ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.  దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు శ్రీకాంత్‌..