నేరడిగొండ, వెలుగు : ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడె గజేందర్ అన్నారు. మంగళవారం బీఫామ్ అందుకొని వస్తున్న ఆయనకు నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద అభిమానులు, కార్యకర్తలు బైక్ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడుతూ నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఫైర్అయ్యారు. కాంగ్రెస్ నిరుపేదల పక్షాన నిలుస్తుందని, మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు.