ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఏం చేయాలన్నా తప్పనిసరిగా ఉండాల్సిన ప్రూఫ్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఉండటం ఎంత ముఖ్యమో.. అదే ఆధార్ కార్డు అప్డేటెడ్ గా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఆధార్ లో మొబైల్ నంబర్, అడ్రస్, పేరు వంటి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఆధార్ డీటెయిల్స్ ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14, 2024 వరకు ఆధార్ డీటెయిల్స్ ఫ్రీగా అప్డేట్ చేసుకునే వెసలుబాటుకి ఉంది.
ALSO READ | Bank Jobs: 600 బ్యాంకు కొలువులు.. ఏడాదికి రూ.6.50 లక్షల వరకు జీతం
సెప్టెంబర్ 14, 2024 వరకు ఉన్న ఈ గడువును ఇటీవలే డిసెంబర్ 14 వరకు పొడిగించింది ప్రభుత్వం. ఇప్పటిదాకా ఆధార్ అప్డేట్ చేసుకోనివారు గడువులోగా అప్డేట్ చేసుకోవాలని తెలిపింది ప్రభుత్వం.
ఆధార్ లో డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి గైడ్ లైన్స్ ఇవే:
- myaadhaar.uidai.gov.in కి వెళ్లి.. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- మీ ప్రొఫైల్‌లోకి వెళ్లి మీ గుర్తింపు, అడ్రస్ వంటి డీటెయిల్స్ చెక్ చేసుకోండి.
- తర్వాత 'పై వివరాలు సరైనవని నేను ధృవీకరించాను' అన్న ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- డ్రాప్-డౌన్ మెనుల నుండి మీరు సమర్పించాలనుకుంటున్న ఐడెంటిటీ మరియు అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేయాలి.
- సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
- అప్డేట్ చేసిన డీటెయిల్స్ ని రివ్యూ చేసి సబ్మిట్ చేయండి.