
ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో మనందరికి తెలుసు..ప్రభుత్వ పథకాలకు ఇది తప్పనిసరి. ఇక ప్రైవేట్ సంస్థల్లో గుర్తింపుగా మాండేటరీ. స్కూల్ అడ్మిషన్లు, బ్యాంకు ఖాతాలు తెరవడం వంటి వాటికి ఈ యూనిక్ నంబర్ తప్పనిసరి. ఒక్క ముక్కలో చెప్పాలంటే..వ్యక్తి గుర్తింపునకు ఆధార్ కార్డే ముఖ్యం.ఇలాంటి సమయంలో ఆధారు కార్డు తప్పుడు సమాచారం ఉంటే సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు UIDAI మన వివరాలు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఇస్తుంది. అయితే అప్డేట్ చేసుకునేందుకు పరిమిత అవకాశాలు మాత్రమే ఇస్తుంది. ఆధారు కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
మొబైల్ నంబర్ అప్డేట్..
ఆధార్ కార్డుకు లింకప్ చేయబడిన మొబైల్ నంబర్ ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు.. మొబైల్ నంబర్ లో తప్పులున్నా లేదా కొత్త నంబర్ తీసుకున్నా అప్డేట్ చేసుకోవచ్చు.మొబైల్ నంబర్ అప్డేడ్ కు లిమిట్ లేదు.
పేరు అప్డేట్..
ఆధార్ కార్డులో పేరులో ఏదైనా తప్పులుంటే మార్చడానికి మాత్రం కఠినమైన పరిమితులున్నాయి. ఆధార్ కార్డులో ఉన్న పేరులో ఏదైనా సవరణలు చేసుకోవాలంటే కేవలం రెండుసార్లు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మీరు పేరును అప్డేట్ చేసుకునేముందు జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకునేందుకు పాన్ కార్డుగానీ, మ్యారేజ్ సర్టిఫికెట్ గానీ,పాస్ పోర్టు వంటి ప్రూఫ్ లను సమర్పించి అప్టేడ్ చేసుకోవాలి.
పుట్టిన తేది అప్డేట్..
ఇక పుట్టిన తేది మార్పుకు UIDAI ఒకే ఒక్క అవకాశం మాత్రమే ఇచ్చింది. బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ వంటి సరియైన ప్రూఫ్ లను సమర్పించి ఆధార్ కార్డులో పుట్టిన తేదిని అప్డేట్ చేసుకోవాలి. ప్రత్యేకించి పుట్టిన తేది విషయంలో UIDAI రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. కాబట్టి వివరాలు ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి.
అడ్రస్ లో మార్పులు
ఇక అడ్రస్ అప్డేట్ విషయానికి వస్తే.. ఎన్నిసార్లైన చిరానామా (అడ్రస్) మార్చుకునేందుకు UIDAI అవకాశం ఇచ్చింది. కరెంట్ బిల్, రెంట్ అగ్రిమెంట్, బ్యాంక్ స్టేట్ మెంట్ వంటి ప్రూఫ్ లను సమర్పించి అన్ లిమిటెడ్ గా అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ ద్వారా గానీ, ఆఫ్ లైన్ ద్వారాగానీ పైన తెలిపిన అప్డేట్ లను చేసుకోవచ్చు.