ఆధార్ కార్డు అప్డేట్ కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. పదేళ్లకోసారి ఆధార్ అప్డేట్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులో వివరాలను సమర్పించడం అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.. అయితే ఆధార్ అప్డేడ్ గడువు నేటితో ముగిస్తుండటంతో వినియోగదారుల సౌకర్యం కోసం మరోసారి పొడిగించింది.. 23025 జూన్ 14 వరకు గడువు పెంచింది.
ఉచిత గడువు తేదీని మొదటి 2024 జూన్ 14 వరకు ఇచ్చిన UIDAI.. ఆ తర్వాత ఆధార్ అప్డేట్ కోసం డిసెంబర్ 14, 2025 వరకు మరోసారి పొడిగించింది. ఇంకా లక్షలాది మంది ఆధార్ నంబర్ హోల్డర్లు తమ కార్డును అప్డేట్ చేసుకోలేదు.. వీరికోసం మరోసారి UIDAI గడువు పెంచింది.
ఆధార్ కార్డు ఎలా అప్డేట్ చేసుకోవాలంటే..
- మొదట UIDAI అధికారిక వెబ్ సైట్ సర్వీస్ పోర్టల్ నుసందర్శించాలి.
- మీ మొబైల్ నంబర్, మీ ఆధార్ కార్డు నంబర్, క్యాప్చా ను ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది.దీంతో లాగిన్ అవ్వాలి.
- తర్వాత డాక్యుమెంట్ విభాగంలోకివెళ్లి డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోవాలి.
- ధృవీకరణ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లను స్కాన్ చేసిన కాపీలను అప్ లోడ్ చేయాలి.
- డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ను నోట్ చేసుకోవాలి..ఇది మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ ను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
- ఆధార్ కార్డులో వివరాలు ఎందుకు అప్డేట్ చేయాలంటే..
- ఇప్పుడు అన్నింటికీ ఆధార్ కార్డు నంబర్ ఆధారం కాబట్టి.. మీకు సంబంధించిన తాజా సమాచారం అందాలంటే.. తప్పనిసరిగా ఆధార్ కార్డులో మీ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ కావాల్సి ఉంటుంది.
- మీ పిల్లలకు ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పుడే ఆధార్ కార్డు నమోదు చేసినట్లయితే.బయోమెట్రిక్ రికార్డును కనీసం రెండుసార్లు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు దాటిని తర్వాత మరోసారి 15 సంవత్సరాలకు అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
ఆఫ్ లైన్ అప్డేట్ కోసం..
- మొదట UIDAI వెబ్ సైట్ నుంచి ఆధార్ అప్డేట్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి..
- ఫారంను నింపి, అవసరమైన ఐడెంటిటీ డాక్యుమెంట్లను ఆధార్ సెంటర్ లో సమర్పించాలి.
- ఆధార్ సేవా కేంద్రాల్లోనే బయోమెట్రిక్ పూర్తి చేసుకోవాలి.
- ప్రక్రియ పూర్తయిన తర్వాత URNతో కూడిన రిసిప్ట్ ను పొందాలి. ఇది మీ ఆధార్ అప్డేట్ ను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.