ఏపీలో ప్రతి పరిశ్రమకు ’‘ఆధార్‘’

ఏపీలో ప్రతి పరిశ్రమకు  ’‘ఆధార్‘’

ప్రతి ఇండస్ట్రీకి నంబర్‌‌

అమరావతి, వెలుగు: ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో స్పెషల్ నెంబర్‌‌‌‌ను జారీ చేయనుంది. రాష్ట్రం లో ఉన్న ఇండస్ట్రీలపై సర్వే చేయాలని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇండస్ట్రీల్లో ఉండే కార్మికులు, కరెంట్, భూమి, నీటి లభ్యత, ఎగుమతులు, దిగుమతులు, ముడి సరుకు లభ్యత, మార్కెటింగ్ తోపాటు 9 అంశాల్లో వివరాలు సేకరిస్తారు. మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌తో గ్రామ, వార్డు సెక్రటేరియట్ ద్వారా సర్వే చేయనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌‌‌‌, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్‌‌‌‌ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అక్టోబర్‌‌‌‌ 15కి సర్వే పూర్తి చేయాలని ఆదేశించింది.