హైదరాబాద్, వెలుగు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, జూన్ 30, 2024తో ముగిసిన క్వార్టర్లో రూ.200 కోట్ల నికరలాభం సంపాదించింది. నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ 30 జూన్ 2023 నాటికి రూ. 17,947 కోట్ల నుంచి 30 జూన్ 2024 నాటికి 21శాతం వృద్ధితో రూ. 21,726 కోట్లకు చేరింది. 30 జూన్ 2024 నాటికి మొత్తం లోన్ ఖాతాల సంఖ్య 2.74 లక్షలకు చేరుకుంది.
లాభం వార్షికంగా 37 శాతం పెరిగింది. ఆస్తులపై రాబడి (ఆర్ఓఏ) మొదటి క్వార్టర్ 2025 ఆర్థిక సంవత్సరానికి 4.1శాతం వద్ద ఉంది. ఈక్విటీపై రాబడి (ఆర్ఓఈ) 2025 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో15.9శాతం వుంది . 30 జూన్ 2024 నాటికి గ్రాస్ఎన్పీలు 1.31శాతానికి పడిపోయాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ 21 రాష్ట్రాల్లోని 544 జిల్లాల్లో 536 శాఖలకు విస్తరించింది. ఈ క్వార్టర్లో 13 కొత్త శాఖలను ప్రారంభించింది