
- ఫేక్ కార్డుల జారీ, ఏజెంట్ల వ్యవస్థకు అడ్డుకట్ట
- త్వరలో అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు
హైదరాబాద్, వెలుగు: సురేశ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. ఒక యాక్సిడెంట్ నేపథ్యంలో అతడి లైసెన్స్ సస్పెండ్ చేశారు. దీంతో అతడు పేరులో స్పెల్లింగ్ మార్చి సంగారెడ్డిలో మళ్లీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నాడు. ఇలా అనేక మంది అక్రమంగా ఫేక్ కార్డులు, ఫేక్ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఆధార్ కార్డు కంపల్సరీ చేయనున్నారు. 15 రకాల ఆర్టీఏ సర్వీసులు పొందాలంటే ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది.
ఎన్నో ఇబ్బందులు
డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ లాంటి సేవల కోసం ఆర్టీఏ ఆఫీసుల్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. అనేక సందర్భాల్లో స్లాట్లు కూడా అనుకున్న టైంలో దొరకడం లేదు. స్లాట్ దొరికినా లైన్లలో కొన్ని గంటల పాటు ఉండాల్సి వస్తోంది. ఇలా నిలబడలేనివారు, తొందరగా పని కావాల్సిన వారు బ్రోకర్లు, స్టాఫ్‌కు డబ్బులిచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఇక డాక్యుమెంట్లు తీసుకుని అందరూ నేరుగా ఆఫీసులకు రావడం వల్ల రద్దీ పెరుగుతోంది. దీంతో స్టాఫ్‌కు కూడా పనిభారం పెరిగిపోతోంది.
పారదర్శకత, నాణ్యమైన సేవలు
ఆధార్ కార్డు లింక్ చేస్తే పారదర్శకంగా, నాణ్యమైన సేవలు పొందే చాన్స్ ఉంటుంది. ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే పలు రకాల సేవలు పొందొచ్చు. అనేక మంది నకిలీ ఐడీ కార్డులుపెట్టి ఫేక్ కార్డులు పొందుతున్నారు. ఆధార్ లింక్ చేయడంతో ఇకపై ఫేక్‌గాళ్లు వెంటనే దొరికిపోతారు. బ్రోకర్ వ్యవస్థకు చెక్ పడనుంది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివిధ పనుల కోసం కొద్ది మంది మాత్రమే ఆర్టీఏ ఆఫీసులకు రావాల్సి ఉంటుంది.
15 రకాల సర్వీసులకు..
ప్రస్తుతం ఆర్టీఏలో సేవలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరికాదు. ఏదైనా ఐడీ ప్రూఫ్ చూపిస్తే సేవలు పొందవచ్చు. కొత్త విధానం వస్తే లెర్నర్స్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ చేంజ్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, టెంపరరీ రిజిస్ట్రేషన్, వెహికల్ రిజిస్ట్రేషన్, డూప్లికేట్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్, ఎన్‌వోసీ, ఓనర్‌షిప్ ట్రాన్స్ ఫర్, అక్రెడిటెడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్‌తోపాటు మరో రెండు సర్వీసులకు ఆధార్ కార్డు జత చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు లేకుంటే ఎన్ రోల్ మెంట్ నంబర్ ఇచ్చినా సరిపోతుందని అధికారులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
వరి సాగులో ఆల్‌టైమ్ రికార్డ్
పర్మినెంట్ చేయరు.. జీతాలు పెంచరు
తుంగభద్రకు తూట్లు : ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి రెడీ అయిన ఏపీ
కేసీఆర్ పాలనలో కబ్జాలు.. మాఫియాలు