కోటి మొబైల్ నంబర్లకు ఆధార్‌‌ లింకింగ్

కోటి మొబైల్ నంబర్లకు ఆధార్‌‌ లింకింగ్


న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో  కోటి మొబైల్ నంబర్లను సంబంధిత యూజర్ల ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డులతో లింక్ ​చేశామని   యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకటించింది. ఇదే ఏడాది జనవరిలో 56.7 లక్షల మొబైల్‌ నెంబర్స్‌​ ఆధార్​తో లింక్​ అయ్యాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో వీటి సంఖ్య 93 శాతం పెరిగింది. ఆధార్‌‌‌‌తో పాన్ నంబర్‌‌‌‌ను లింక్ చేయడం తప్పనిసరి కావడంతో, ఆధార్‌‌‌‌తో మొబైల్ నంబర్‌‌‌‌లను సీడింగ్ చేయడం కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 90 కోట్ల మంది ఆధార్ హోల్డర్లు తమ మొబైల్ నంబర్‌‌‌‌లను తమ ఆధార్​కార్డుతో లింక్ చేసినట్లు అంచనా. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి, ఎప్పటికప్పుడు ఎస్​ఎంఎస్​ల ద్వారా సమాచారాన్ని అందుకోవడానికి  ఆధార్‌‌‌‌ను మొబైల్ నంబర్‌‌‌‌తో లింక్ చేయాలని యూఐడీఏఐ కోరుతోంది. దాదాపు 1700 కేంద్ర,  రాష్ట్ర సాంఘిక సంక్షేమ పథకాల ‘డైరెక్ట్​ బెనిఫిట్​ట్రాన్స్​ఫర్​’ (డీబీటీ)కు, గుడ్​ గవర్నెన్స్​  స్కీములకు ఆధార్​ను వాడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో  ఆధార్ అథెంటికేషన్​199.62 కోట్ల లావాదేవీలు జరగగా, ఫిబ్రవరిలో 226.29 కోట్లకు చేరుకుంది.