ఆధార్ అప్‌డేట్‌ చేయకుంటే ఏం అవుతుంది? ఈ డేట్‌లోగా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు

ఆధార్ అప్‌డేట్‌ చేయకుంటే ఏం అవుతుంది? ఈ డేట్‌లోగా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు

ఆధార్ కార్డు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవడానికి  UIDAI ఇచ్చిన గడువు దగ్గరపడుతుంది. సెప్టెంబర్ 14 లోపు ఆధార్‌లో తప్పుతను ఉచితంగా సవరించుకొని అప్‌డేట్ చేసుకోవచ్చు. తర్వత ఆధార్ లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.  ఆధార్ కార్డులు జారీ చేసి  ఇప్పటి వరకు 10 ఏళ్లు అవుతుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ లేటెస్ట్ అప్‌డేట్ ఉందా.. ఆధార్ రీవాలిడేషన్ ఇంపార్ట్ టెన్స్ గురించి వివరించింది. తప్పకుండా ఆధార్ లో మీ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని UIDAI కోరుతుంది.

సెప్టెంబర్ 14 గడువులోగా మీరు మీ ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయించకపోలే.. తర్వాత ఏవైనా అప్‌డేట్‌ల కోసం మీరు రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. UIDAI 10 సంవత్సరాల క్రితం జారీ చేసిన ఆధార్ కార్డ్‌ల కోసం ఈ రీవాలిడేషన్‌ను తప్పనిసరి చేసింది. అప్పటి నుంచి ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ చేయబడలేదు. అన్ని డిటేల్స్ లేటెస్ట్ వే ఉండేలా చూసుకోవాలని UIDAI సూచిస్తుంది. 

ఆధార్ అప్డేట్ చేసే విధానం :

  • UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి మై ఆధార్ లాగిన్ పై క్లిక్ చేయండి.
  • తర్వాత ఆధార్‌ను అప్‌డేట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
  • తర్వత కార్డ్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్, 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి.. సెండ్ OTP పై క్లిక్ చేయండి. 
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • లాగిన్ చేయడానికి OTPని నమోదు చేయండి.
  • అక్కడ ఆధార్ కార్డు అప్‌డేట్ చేయడానికి ఫీల్డ్‌లను సెలెక్ట్ చేసుకోండి
  • మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID వంటి వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.
  • ఇలా అన్ని డిటేల్స్ అప్డేట్ చేశాక.. కన్ఫామ్ చేస్తే ఓ అక్నాలెడ్జ్ మెంట్ సిప్ జనరేట్ అవుతుంది.