తిరుమల ఆన్లైన్ దర్శనానికి ఆధార్ అనుసంధానం..

ఆన్లైన్ దర్శనానికి ఆధార్ అనుసంధానం చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆన్లైన్ ద్వారా అందిస్తున్న దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను దళారుల బెడద ఉన్న సంగతి తెలిసిందే. దళారుల బెడద నివారించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటి అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు సంబంధించి యుఐడిఎఐ అధికారుల సహకారాన్ని తీసుకోవాలని ఈవో సూచించారని సమాచారం.

ఆధార్ ద్వారా దర్శనానికి వచ్చిన గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానం, ఆధార్ డూప్లికేషన్ నిరోధించే దిశగా చర్యలు వంటి తదితర అంశాలపై ఈవో అధికారులతో చర్చించినట్లు తెలిపారు.అంతకుముందు యుఐడిఎఐ అధికారులు ఆధార్ ను ఏ విధంగా అప్లికేషన్ లకు లింక్ చేయవచ్చు వంటి అంశాలపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. టీటీడీ తాజా నిర్ణయంతో త్వరలోనే తిరుమలలో దళారి వ్యవస్థకు చెక్ పడనుందని చెప్పచ్చు.