ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ ‘శబ్దం’. అరివళగన్ దర్శకుడు. ‘వైశాలి’ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న రెండో చిత్రమిది. ఆల్ఫా ఫ్రేమ్స్, 7జీ ఫిల్మ్స్ శివ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 28న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రాన్ని ముంబై, మున్నార్, చెన్నైలోని అనేక ప్రదేశాలలో చిత్రీకరించామని, ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం రూ.రెండు కోట్ల బడ్జెట్‌తో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించినట్టు ఈ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రాజీవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.