Akhanda 2: అఖండ తాండవం మొదలైంది.. బాలయ్యకు విలన్‌‌‌‌గా.. సరైనోడినే దింపిన బోయపాటి

Akhanda 2: అఖండ తాండవం మొదలైంది.. బాలయ్యకు విలన్‌‌‌‌గా.. సరైనోడినే దింపిన బోయపాటి

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌‌‌‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఆది పినిశెట్టి ఇందులో ఓ కీలకపాత్రను పోషిస్తున్నాడు. శనివారం ఈ విషయాన్ని ప్రకటించారు. బోయపాటి గతంలో తెరకెక్కించిన ‘సరైనోడు’ చిత్రంలో ఆది విలన్‌‌‌‌గా మెప్పించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌‌‌‌లో వేసిన సెట్‌‌‌‌లో యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది.  ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్‌‌‌‌ పర్యవేక్షణలో బాలకృష్ణ,  ఆది మధ్య యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌ చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని మెయిన్‌‌‌‌ హైలైట్స్‌‌‌‌లో ఇది ఒకటిగా నిలుస్తుందని, ఆది కెరీర్‌‌‌‌‌‌‌‌లో మోస్ట్ ఇంపాక్ట్ క్యారెక్టర్స్‌‌‌‌లో ఇది ఒకటిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. బాలకృష్ణకు జంటగా సంయుక్త నటిస్తోంది. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమా థియేటర్లలోకి రానుంది.