Aadhi pinisetty : వైశాలి సీక్వెల్ శబ్దం ట్రైలర్ రిలీజ్

Aadhi pinisetty : వైశాలి సీక్వెల్ శబ్దం  ట్రైలర్ రిలీజ్

వైశాలి’ తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌‌ కాంబినేషన్‌‌లో వస్తున్న చిత్రం ‘శబ్దం’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీని 7జీ ఫిల్మ్స్ శివ నిర్మిస్తున్నారు. బుధవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు.  ‘వెయ్యి గబ్బిలాలు చెవిలో అరుస్తున్నట్లు వుంటుంది డాక్టర్’ అనే వాయిస్‌‌తో ట్రైలర్ మొదలైంది. ఇదొక రకమైన ఆడియో హాలోజినేషన్ అని చెప్తారు డాక్టర్స్. వ్యోమ అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో కనిపించాడు ఆది. 

కంటికి కనిపించకుండా కేవలం శబ్దాలతో భయపెడుతున్న ఓ ఇన్విజబుల్ పవర్‌‌‌‌ని అతను ఎలా క్యాప్చర్ చేశాడు అనేది మూవీ మెయిన్‌‌ కాన్సెప్ట్‌‌ అని అర్థమవుతోంది. సిమ్రాన్, లైలా,  లక్ష్మీ మీనన్ క్యారెక్టర్స్‌‌ ఇంట్రస్టింగ్‌‌గా ఉన్నాయి. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌‌‌‌ను డిఫరెంట్‌‌గా ప్రజెంట్ చేయడం ఆసక్తి రేపుతోంది.  ఫిబ్రవరి 28న ఆంధ్రాలో ఎన్ సినిమాస్, నైజాంలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది.