ఆది పినిశెట్టి సరికొత్త శబ్దం మూవీ రిలీజ్ డేట్ లాక్

ఆది పినిశెట్టి సరికొత్త శబ్దం మూవీ రిలీజ్ డేట్ లాక్

ఆది పినిశెట్టి హీరోగా నటించిన తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ ‘శబ్దం’.  అరివళగన్‌‌ దర్శకుడు.  ‘వైశాలి’ తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందిన రెండో చిత్రమిది. 7జీ ఫిల్మ్స్ సమర్పణలో శివ నిర్మిస్తున్నారు.  ఫిబ్రవరి 28న  వరల్డ్ వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. ఎన్ సినిమాస్ ద్వారా ఆంధ్ర,  తెలంగాణలో రిలీజ్  కానుందని ప్రకటించారు.  

సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్,  రాజీవ్ మీనన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌‌తో నిర్మించినట్టు నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఇందులోని విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ సరికొత్తగా ఉంటూ  ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందిస్తాయని అన్నారు. తమన్ సంగీతం అందించాడు.