Crime Thriller: డైరెక్ట్ ఓటీటీకి వస్తోన్న ఆది సాయికుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Crime Thriller: డైరెక్ట్ ఓటీటీకి వస్తోన్న ఆది సాయికుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘సబ్‌ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’(SubInspectorYugandhar). మేఘలేఖ హీరోయిన్. యశ్వంత్ దర్శకత్వంలో ప్రదీప్ జూలూరు నిర్మిస్తున్నారు. ఇందులో ఆది పోలీస్ ఆఫీసర్‌‌‌‌ గా నటిస్తున్నాడు.క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ మూవీ థియేటర్స్లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు టాక్.

ఈ మేరకు (డిసెంబర్ 23న) ఆది సాయి కుమార్ బర్త్డే స్పెషల్గా ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీకి వచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ నవంబర్ నెలలోనే పూజా ఈవెంట్ జరుపుకుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

అయితే, ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వకున్న ఓటీటీ ప్లాట్ఫామ్ ట్వీట్ చేయడంతో థియేటర్స్లో రిలీజ్ కావట్లేదని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ చిత్రంలో రైటర్ రాకేందు మౌళి విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రణవ్ గిరిధరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇకపోతే ప్రేమకావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆది సాయి కుమార్. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సరైన హిట్ మాత్రం దక్కట్లేదు. లవ్‌లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే, నెక్ట్స్ నువ్వే, రఫ్, చుట్టాలబ్బాయ్, తీస్ మార్ ఖాన్, శశి, క్రేజీ ఫెలో, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ వంటి సినిమాలు చేసినప్పటికీ చెప్పుకునేంత పెద్ద హిట్ మాత్రం లేదు.

ALSO READ : సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు లేవు. .ఆ హీరో ప్రొసీడ్ అనడంతో ముందుకొచ్చాం: నిర్మాత

ప్రస్తుతం ఆది చేతిలో రెండు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సబ్‌ ఇన్‌స్పెక్టర్, మరొకటి శంభాల. ఈ సినిమాలతో ఎలాంటి విజయం అందుకోనున్నాడో చూడాలి.