
ఉప్పెన, రంగరంగా వైభవంగా, కొండపొలం చిత్రాల్లో సాఫ్ట్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు ‘ఆదికేశవ’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే యాక్షన్ టీజర్‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. శుక్రవారం మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 18న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. మలయాళ యాక్టర్ జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.