అంచనాలు అందుకోని ఆమ్ ఆద్మీ

ఢిల్లీలో ఏడు సీట్లుండగా, మూడు పెద్ద పార్టీలు బరిలో నిలబడ్డాయి. కాంగ్రెస్‌ తో పొత్తు కుదిరే అవకాశం ఉన్నప్పటికీ కేజ్రీవాల్‌ చేజేతులా చెడదీసుకున్నారని స్వయానా రాహుల్‌ గాంధీ అన్నారు. కేంద్రంతో పార్టీలకతీతంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాజికల్‌ అప్రోచ్‌ తో తమకు కావలసినవి సాధించుకుంటున్నాయి. కేజ్రీ ప్రభుత్వం మాత్రం నిత్యం సెంటర్‌‌ని సవాల్‌ చేస్తూ కాలం గడుపుతోందని షీలా దీక్షిత్‌ లాంటి కరడుగట్టిన బీజేపీ వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ జనాలు తాము నొక్కాల్సింది ఓటుకా, నోటాకా అనేది తెలియని అయోమయం ఏర్పడింది.

ఓ ఆరేళ్ల క్రితం ‘ఆప్‌ ’ పేరు వినగానే దాదాపు అందరికీ అవినీతిపై పోరాడడానికి వచ్చిన పెద్ద శక్తిగా అనిపిం చేది. 2013లో మొదటిసారి హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌  సీఎం షీలా దీక్షిత్‌‌‌‌‌‌‌‌ (కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌)ని కూలదోసి ,మళ్లీ అదే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పొత్తు అరవింద్‌ కేజ్రీవాల్‌  ప్రభుత్వం ఏర్పా టు చేశారు. కానీ, సైద్ధాంతిక విభేదాలతో కొద్ది రోజుల్లోనే రాజీనామా చేసేసి, 2015లో మోడీ ప్రభంజనాన్ని ఢీకొట్టి రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ రెండు సందర్భాల్లో నూ ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘ఆమ్‌‌‌‌‌‌‌‌ ఆద్మీ (సామాన్యుడు)’గానే జనంలో గుర్తిం పు పొం దారు. ఇప్పుడాయనకు తొలి అగ్ని పరీక్ష ఎదురైంది. జనరల్‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌లో ఒంటరిపోరు సాగిస్తున్నారు. అటు కాం గ్రెస్‌‌‌‌‌‌‌‌కి చేరువ కాలేక,ఇటు సోషలిస్టు శక్తులు దగ్గరకు రానివ్వక కేజ్రీవాల్‌ ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని ఏడు సీట్లకూ ఆప్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీళ్ల వల్ల హస్తినలో ట్రయాంగిల్‌ వార్‌ నడుస్తోంది.

ప్రస్తుత ఎన్నికల ప్రచారమంతా బీజేపీ కేంద్రంలో సాధించిన విజయాలకంటే… ఢిల్లీలో ఈ నాలుగేళ్లలోనూ ఆప్‌ సర్కారు పనితీరుపైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌ పడింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ కన్వీనర్‌ హోదాలో అరవింద్‌ కేజ్రీవాల్‌ మొత్తం 70 ప్రామిస్‌‌‌‌‌‌‌‌లు చేశారు. వీటిలో 67 హామీల్ని మరచిపోయారని బీజేపీ ఊదరగొడుతోంది. ఒకప్పుడు కేజ్రీవాల్‌ తో భుజం భుజం కలిపి నడిచిన యోగేంద్ర యాదవ్‌ , షాజియా ఇల్మి, ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ భూషణ్‌ , కిరణ్‌ బేడీ వంటి వారు ఒక్కొక్కరుగా  పక్కకు తప్పుకున్నారు. ఆప్‌ కన్వీనర్‌ తన శక్తికి మించిన ఆలోచనలు చేస్తారన్నది వీళ్లందరి ఆరోపణ. ఉదాహరణకు, 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 414మంది కేండిడేట్లను బరిలో దింపగా, వాళ్లలో పంజాబ్‌ లోని నలుగురు మినహా మిగతా అందరూ డిపాజిట్లు కోల్పోయారు. మొత్తంగా రెండు శాతం ఓట్లతో ఆప్‌ ఘోరంగా దెబ్బతిన్నది. ఒక్క ఢిల్లీలో మాత్రం పోటీ చేసిన ఏడు సీట్లలో ఒక్కటీ గెలవలేకపోయినా 32.9 శాతం ఓట్లు సాధించగలిగింది. ఈ బలంతోనే 2015లో కాస్త గట్టిగా పనిచేసి, ఢిల్లీ అసెంబ్లీలోని 70సీట్లలో 67 సీట్లతో ల్యాండ్‌ స్లయిడ్‌ విక్టరీ సాధించగలిగారు ఆమ్‌‌‌‌‌‌‌‌ ఆద్మీ పార్టీకి నేషనల్‌ రికగ్నైజేషన్‌‌‌‌‌‌‌‌ తీసుకువచ్చి, జాతీయ పార్టీ హోదా తేవాలన్న దురాశతోనే అన్ని రాష్ట్రాల్లో నూ పోటీకి దిగుతున్నారని కేజ్రీవాల్‌పాత మిత్రులు ఆరోపిస్తుంటా రు.

వీళ్ల ఆరోపణల్లో నిజానిజాలెలా ఉన్నా… రెండోసారి ఢిల్లీ సీఎం అయ్యాక ఆయనలోని లోపలి మనిషి బయటకొచ్చాడని పొలిటికల్‌ కామెంటేటర్లు చెబుతారు.ఈ నేపథ్యం లో… ఈ నెల 12వ తేదీన ఢిల్లీ ఎంపీ సీట్లకు జరిగే పోలింగ్‌‌‌‌‌‌‌‌లో ‘నోటా’ బటన్‌‌‌‌‌‌‌‌ నొక్కాలనిసామాజికవేత్త, రాజకీయ నాయకుడు యోగేంద్రయాదవ్ పిలుపునిచ్చారు. ఆయనకు మద్దతుగా వేర్వేరు పొలిటికల్ యాక్టివిస్టులు, స్వరాజ్‌ అభియాన్‌‌‌‌‌‌‌‌ సంస్థ నిలబడ్డారు. ఆప్‌ ఫెయిల్యూర్స్‌‌‌‌‌‌‌‌తోపాటుగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు అనేక అంశాలపై నెగెటివ్‌ మార్కులతో ఉందని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదని యాదవ్‌ ఆరోపిస్తున్నారు.కాబట్టి, ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ ఓట్లు అడిగే అర్హత లేనందున ‘నోటా’ గుర్తుపై ఓట్లు వేసి, జనం అసంతృప్తిని చాటాలన్నది స్వరాజ్‌ అభియాన్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయం.

ప్రతి సమస్యకు స్టేటస్‌ తో ముడి

ఢిల్లీ వరకు చూసినట్లయితే… అక్కడి ప్రజలు ఎప్పటిలాగే కాలుష్యం , పర్యావరణం,  ప్రజా రవాణా, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌, మలేరియా తదితర అంటువ్యాధులతో సతమవుతున్నారు. వీటికి దీర్ఘకాలిక పరిష్కారాన్నిసూచిం చడంలో ఆప్‌ సర్కారు ఫెయిలైందన్న భావన జనంలో బాగా ప్రచారమవుతోం ది. అరవింద్‌ కేజ్రీవాల్‌ చాలా విషయాలను ‘ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా(ఫుల్‌ ఫ్లెడ్జెడ్‌ స్టేట్‌‌‌‌‌‌‌‌ స్టేటస్‌‌‌‌‌‌‌‌)’తో ముడిపెడతారన్నది మరో ఆరోపణ. ఎన్‌‌‌‌‌‌‌‌సీ టీ ఏరియాలో దాదాపు 1,700కాలనీలు అక్రమంగా వెలిశాయి. వీటిని రెగ్యు లరైజ్‌ చేయలేకపోయారు. పర్యావరణ విధానాలు, మౌలిక సదుపాయాలు, రెగ్యులేషన్‌‌‌‌‌‌‌‌, ఆర్థిక వ్యవహారాలు,వివిధ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం వంటి విషయాల్లో పార్టీలకతీతంగా దేశంలోని అన్ని ప్రభుత్వాలు కేంద్రంతో లాజికల్‌ అప్రోచ్‌‌‌‌‌‌‌‌తో పోతున్నాయి. కేజ్రీ ప్రభుత్వం మాత్రం ఘర్షణ వైఖరిని అవలంబిస్తోం ది. దీంతో కేంద్రం నుంచి అందాల్సిన  సహాయసహకారాలు పూర్తిగా అందడం లేదు.

దగ్గరకు రానివ్వని షీలా, కెప్టెన్‌

‌‌‌‌‌‌‌ ఈ విషయంలో ఇతర మధ్యేవాద, వామపక్ష ఆలోచనలున్నవాళ్లను, నాన్‌‌‌‌‌‌‌‌–బీజేపీ వర్గాలను కలుపుకు వెళ్లడంలో కేజ్రీ ఫెయిలయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే 2019 జనరల్‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌లో ప్రతి ఒక్కరూ కేజ్రీవాల్‌ తో ‘టచ్‌‌‌‌‌‌‌‌ మి నాట్‌‌‌‌‌‌‌‌’గానే ఉన్నారు. జాతీయ రాజకీయాలకు సంబంధించి కూడా కేజ్రీ కొక విజన్‌‌‌‌‌‌‌‌ లేదన్న వాదన కూడా ఉంది. బీజేపీ, కాం గ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలకు సమాన దూరంలో ఉండాలా? లేక, ఏదో ఒక పార్టీతో జత కట్టా లా అనే ఎలక్టోరల్‌  స్ట్రేటజీపై కూడా సీనియర్లతో చర్చించలేదన్న విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చివరి వరకు ఆప్‌ తో స్నేహం కోసం ఎదురుచూసిం ది.అయితే, కేజ్రీవాల్‌ తనకు పంజాబ్‌ , హర్యానాల్ లో కూడా వాటా ఇస్తేనే ముందుకొస్తానని బిగుసుకు కూర్చున్నారు. ఢిల్లీలో షీలా దీక్షిత్‌‌‌‌‌‌‌‌, పంజాబ్‌ లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ అమరీందర్‌ సింగ్‌‌‌‌‌‌‌‌… ఇద్దరూ కేజ్రీ పొడగిట్టని వాళ్లే.మొత్తానికే పొత్తు బెడిసికొట్టింది. చివరకు కేజ్రీవాల్‌హర్యానాలో ఒక కొత్త నేస్తాన్ని వెదుక్కున్నారు. జన్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ జనతా పార్టీ (జేజేపీ)తో కలిశారు. హర్యానాలో మొత్తం 10 సీట్లుండగా, జేజేపీ 7 చోట్ల, ఆప్‌ మూడు చోట్ల పోటీకి రెడీ అయ్యాయి.

పరిస్థితులు రాజకీయంగానూ, పాలనాపరంగానూ కేజ్రీకి అనువుగా లేకపోవడం; మరోవంక తరచు కేంద్రంతో తగాదా పడడంతో బ్యూరోక్రసీని సక్రమంగా నడపలేకపోవడం వంటివి ఆప్‌ అవకాశాల్ని దెబ్బతీస్తాయని పొలిటికల్‌ సర్కిల్‌ లో అంచనా వేస్తున్నారు.ఢిల్లీ జనాలు కూడా ట్రయాంగిల్‌ వార్‌ లో ఎటువైపు మొగ్గాలన్న అయోమయంలో ఉన్నారు. అలాగని,యోగేంద్ర యాదవ్‌ మాట విని… పోటీలో ఉన్న వాళ్లెవరూ తమకు నచ్చలేదని ‘నన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది ఎబౌవ్‌ (నోటా)’బటన్‌‌‌‌‌‌‌‌ నొక్కినా ప్రయోజనం ఉండదు. ఇప్పడున్నఎలక్టోరల్‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ‘నోటా’కి వచ్చిన ఓట్లతోఒరిగేదేమీ లేదు. పోలైన ఓట్లలో ఎక్కువ వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఈ నెల 12న జరిగే ఆరోవిడత పోలింగ్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ ఓటర్లు ఎవరికి ఓటేస్తారన్నది ఆన్సర్‌ లేని క్వశ్చన్‌‌‌‌‌‌‌‌.

నిందలతోనే కాలయాపన

ఢిల్లీ నగరానికి ప్రత్యేకించి ప్రభుత్వం లేదు.నేషనల్‌ కేపిటల్‌ టెర్రిటరీ (ఎన్‌‌‌‌సీ టీ)లో ఉంది.ఇండియన్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌కి చెందిన టాప్‌లీడర్లు, అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ వంటివన్నీ ఇక్కడే ఉన్నందువల్ల… శాంతి భద్రతల రీత్యా పోలీసు, లా అండ్‌ ఆర్డర్‌ , ల్యాం డ్‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌, మునిసిపాలిటీలు వగైరాలు పూర్తిగా ఢిల్లీ (ఎన్‌‌‌‌సీ టీ) ప్రభుత్వం చేతిలో ఉండవు. వీటిపై తమకు సంపూర్ణ అధికారాలుండాలని, స్టేట్‌‌‌‌ స్టేటస్‌‌‌‌ కల్పించాలని కేజ్రీ డిమాండ్‌ చేస్తున్నారు. ఉదాహరణకు, ఢిల్లీ, దాని చుట్టుపక్కల కేపిటల్‌ టెర్రిటరీలో లో–కాస్ట్‌‌‌‌ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడంలేదు. ఇలాంటిదే ఏదైనా పెద్ద ప్రాజెక్టు చేపట్టాలన్నా, అమలు చేయాలన్నా కొర్రీలు ఎక్కువైపోయి, చేతులు ముడుచుకోవలసి వస్తోందని కేజ్రీ అంటున్నారు. ఢిల్లీకి అటానమీ (స్టేట్‌‌‌‌ స్టేటస్‌‌‌‌) కల్చించినట్లయితే  కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సాగుతున్న బ్లేమ్‌‌‌‌ గేమ్‌‌‌‌ (నిందలువేసుకోవడం) తగ్గుతుం దని వాదిస్తున్నారు.

కేజ్రీవాల్‌ నాలుగేళ్ల పాలనలో…

ప్లస్‌ లు

  • మొత్తం బడ్జెట్‌‌‌‌లో 26 శాతం వరకు విద్యారంగానికే కేటాయిం పు
  • 2015 నుం చి ఇప్పటివరకు నాలుగు బడ్జెట్లలోనూ చదువుకి ఎక్కువ నిధులు
  • ప్రభుత్వ స్కూళ్లలో మోడర్న్‌‌‌‌ క్లాస్‌‌‌‌ రూమ్‌‌‌‌లు ఏర్పాట్లు , సులభమైన సిలబస్‌‌‌‌ పరిచయం చేశారు. మొత్తంగా 11 వేల క్లాస్‌‌‌‌ రూమ్‌‌‌‌లు కట్టిం చారు. వీటికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందాయి.
  • ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తెచ్చారు. 40 రకాల సేవలను ‘డోర్‌ స్టె ప్‌డెలివరీ స్కీమ్‌‌‌‌’లో అందిస్తున్నారు.
  • నెలకు 20 కిలో లీటర్లు (20 వేల లీటర్లు)కంటే తక్కువ నీటిని వాడుకునే వారికి ఉచితం.ఆపైన వాడుకుంటే వాటర్‌ బిల్లు వేస్తారు.
  • ప్రైవేట్‌‌‌‌ డిస్కంలతో ఫైట్‌‌‌‌ చేసి, కరెంటు చార్జీలను 32 శాతం వరకు తగ్గించగలిగారు.
  • ఢిల్లీ గల్లీల్ లో ‘మొహల్లా క్లినిక్‌‌‌‌’లను ఏర్పాటుచేసి, వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు.

మైనస్‌ లు

  • ఢిల్లీ ప్రజలను పీడించే పర్యావరణ, కాలుష్య సమస్యల పరిష్కారంలో ఫెయిలయ్యారు.
  • 2,000 బస్సులు, 1,000 ఎలక్టిక్‌‌‌‌ బస్సులతో ప్రజా రవాణాని మెరుగు పరిచాలని సుప్రీంకోర్టు ఆదేశించినా చేయలేకపోయారు. పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌‌‌‌ అందుబాటులోకి వస్తే సొంతవాహనాలను కట్టడి చేయడానికి వీలవుతుంది.
  • దాదాపు 1700 వరకు గల అక్రమ కాలనీల విషయాన్ని ఎటూ తేల్చలేదు. ఈ కాలనీలను రెగ్యు లరైజ్‌ చేయడంలో విఫలమయ్యారు.నెపం కేంద్రంమీదకు నెట్టేశారు.
  • ప్రొటెక్షన్‌ ‌‌‌కోసం ఏర్పాటు చేస్తామన్న సీసీ టీవీ కెమె రాల ప్రాజెక్ట్‌‌‌‌ అంగుళం కదలలేదు. సెన్సిటివ్‌ ఏరియాల్లో లక్షన్నర వరకు కెమెరాలు ఏర్పాటు చేయాలన్నది కేజ్రీ ఆలోచన.
  • ఢిల్లీ అసెంబ్లీ లో ఆమోదించిన స్వరాజ్‌ బిల్లుపై కేంద్రం ఆమోదం పొందలేకపోయారు. ఈబిల్లును ‘మొహల్లా సభ బిల్లు’గా కేజ్రీ చెబుతుంటారు.