వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది జగనే అని. అప్పట్లో ఈ మేరకు పిటిషన్ వేసిన పొన్నవోలు సుధాకర్ వెనక జగన్ ఉన్నారని, అందుకే అధికారంలోకి వచ్చాక సుధాకర్ కు ఏఏజీ పదవి ఇచ్చారని ఆరోపించారు షర్మిల. షర్మిల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు సుధాకర్, షర్మిల తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే షర్మిల తన పేరును వాడుకుంటున్నారని అన్నారు సుధాకర్.
వైఎస్అర్ పేరును ఎఫ్ఐఆర్ లో తానే చేర్చానని ఎలా అంటారని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు కోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. 2011 సమయంలో తాను ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తున్నానని, అప్పటికి జగన్ అంటే కూడా ఎవరో తనకు తెలియదని అన్నారు సుధాకర్. షర్మిల తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం అని అన్నారు ఏఏజీ సుధాకర్.